Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉచితంగా 5 లక్షల మట్టి గణపతి ప్రతిమలు.. పంపిణీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

KTRBRS  commenced the free distribution of 5 lakh eco friendly Ganesh idols
Advertisement
  • గణేశ్ నవరాత్రుల్లో ఎకో ఫ్రెండ్లీ ప్రతిమలను
    ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • జీహెచ్ఎంసీ 150 వార్డు కార్యాలయాల్లో అందుబాటులో
  • హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరో 50 ప్రాంతాల్లో పంపిణీ
Advertisement
పర్యావరణ పరిరక్షణకు గణేశ్‌ నవరాత్రుల్లో మట్టి గణపతి విగ్రహాలను పూజించడాన్ని కొన్నేళ్లుగా  తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రతి ఏటా ప్రభుత్వం వివిధ శాఖల తరఫున వివిధ మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది హెచ్ఎండీఏ అధ్వర్యంలో ఐదు లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతుల ప్రతిమలను ఉచితంగా అందించనుంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ 150 వార్డు కార్యాలయాల్లో ఇవి అందుబాటులో వుంటాయి. అలాగే, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరో 50 ప్రాంతాల్లో వీటిని ప్రజలకు ఉచితంగా అందించనున్నారు.
Advertisement
Advertisement
Telangana
KTR
Ganesh idols
5 lakh

More Telugu News